NTV Telugu Site icon

తెనాలి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ముంచుకొస్తున్న ఆక్సిజన్ కొరత….

తెనాలి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ముంచుకొస్తుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోవడంతో పరిసర ప్రాంతాల నుండి కొన్ని సిలిండర్లను తెచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసారు అధికారులు. తెనాలి ఆస్పత్రికి రావలసిన ఆక్సిజన్ సాంకేతిక కారణాలతో ఖమ్మంలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో గంటన్నర మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ పై 200 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరింత ఆక్సిజన్ కోసం అధికారులతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే శివకుమార్. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా బయటనుంచి తెప్పిస్తామంటున్నారు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.