‘లండన్ డ్రీమ్స్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య రాయ్ కపూర్ ఆ తర్వాత ‘యాక్షన్ రీప్లే, గుజారిష్, ఆషికీ-2, యే జవానీ హై దివానీ, డియర్ జిందగీ, ఓకే జాను, సడక్ -2’ వంటి పలు చిత్రాలలో నటించాడు. అయితే అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు చేస్తున్న ‘ఓమ్: ది బాటిల్ విత్ఇన్’ ఒక ఎత్తు అంటున్నాడు. తాజా ఈ సినిమాకు సంబంధించిన నయా పోస్టర్ ను విడుదల చేయడమే కాకుండా విడుదల తేదీని ప్రకటించాడు. ‘దిల్ బేచారా’ ఫేమ్ సంజనా సంఘీ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఓమ్’ మూవీ జూలై 1న విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ మూవీని కపిల్ వర్మ దర్శకత్వంలో జీస్టూడియోస్ తో కలిసి అహ్మద్ ఖాన్, సైరా ఖాన్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన అనురాగ్ బసు ఆంథాలజీ మూవీ ‘లుడో’లో ఆదిత్యరాజ్ కపూర్ నటించాడు.
Read Also : Radhe Shyam’s First show : ఎప్పుడు? ఎక్కడ ?