NTV Telugu Site icon

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ…

ఏసీబీ కోర్టులో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. అయితే ఈ విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా హాజరయ్యారు. సాక్షులుగా స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ వాంగ్మూలాలు నమోదు చేసారు. ఏసీబీ సమర్పించిన వీడియోలు, ఆడియోలు నిజమేనని స్టీఫెన్ సన్ కోర్టుకు తెలిపారు. ఏసీబీ సమర్పించిన ఆడియోలో గొంతు చంద్రబాబుదేనని కోర్టుకు తెలిపాడు స్టీఫెన్ సన్. అయితే స్టీఫెన్ సన్ కుమార్తె వాంగ్మూలం నమోదు కోసం విచారణ ఈనెల 7కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.