క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిరుపతి ఎంపిగా ఎన్నికైన డాక్టర్ ఎం. గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా డా. గురుమూర్తి మాట్లాడుతూ.. తిరుపతి గెలుపు చాలా ఆనందం ఇచ్చిందని.. ప్రజలందరూ వైసీపీ వైపు ఉన్నారని మరో సారి స్పష్టం అయ్యిందని తిరుపతి ఎంపిగా ఎన్నికైన డా. గురుమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని.. అందుకే ఇంతటి గెలుపు సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ తన కృతజ్ఞతలు.. పెండింగ్ అంశాలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ప్రజామోదం ఉన్నప్పుడు దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం వైసీపీకి లేదని.. ఓడిపోతామని తెలిసే ఇతర పార్టీలు ఆరోపణలు మొదలు పెట్టాయని చురకలు అంటించారు. నేను వైద్యుడిని కూడా కావటంతో కోవిడ్ నియంత్రణలో మరింత చురుగ్గా నా ప్రయత్నం చేస్తానని చెప్పారు డా. గురుమూర్తి.
దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం వైసీపీకి లేదు : తిరుపతి ఎంపి
