NTV Telugu Site icon

ఈట‌ల రాజీనామాపై స్పందించిన గంగుల‌.. ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మే..!

Gangula Etela

టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్.. ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ కండువా క‌ప్పుకోనున్నారు.. రాజీనామా సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో.. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు ఈట‌ల‌.. అయితే.. ఈట‌ల రాజీనామాపై స్పందించిన మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్.. ఘాటు వ్యాఖ్య‌లుచేశారు.. టీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఏడు సంవత్సరాలు మంత్రి గా ఉన్నావు.. అప్పుడు ఆత్మ గౌరవం లేదా? అని నిల‌దీశారు.. ఇప్పుడు ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి పోతున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. హుజురాబాద్‌లో బ‌లంగా ఉంది టీఆర్ఎస్ పార్టీయే.. ఈట‌ల రాజేంద‌ర్ కాదు అని వ్యాఖ్యానించారు.. సీఎంవోలో బడుగు బలహీన వర్గాలు లేవు.. మంత్రిగా నేను ఉండను అని ఎందుకు అన‌లేద‌ని ప్ర‌శ్నించారు.. ప్రతిసారి హుజూరాబాద్‌ ప్రజలు సీఎం కేసీఆర్ మీద అభిమానంతో ఓటు వేస్తున్నార‌ని తెలిపారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్.