తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుంది. తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుంది. అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని, ప్రజల్లో కేసీఆర్ గారి అచంచల విశ్వాసం వ్యక్తమవుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. తనని కలిసిన హుజురాబాద్ పార్టీ ప్రజా ప్రతినిదులతో కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి మాట్లాడారు, వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ గారి పనితీరుకు, ప్రభుత్వ పనితీరుకు రెపరెండంగా వరుస ఎన్నికల విజయాలే తార్కాణమన్నారు.
హుజురాబాద్లో టీఆర్ఎస్ భలంగా ఉందని, వ్యక్తులు పోయినంత మాత్రానా టీఆర్ఎస్కి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్నే ప్రజలు ఆదరిస్తున్నారని, కేసీఆర్ పోటోనే మా గెలుపు మంత్రమన్నారు. మెన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70శాతం తెలంగాణ ప్రజల విశ్వాసంతో ఘన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇదే నిరూపితమయిందన్నారు.సాగర్లో జానారెడ్డే గెలుస్తాడని అందరూ చెప్పినా..టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం కేసీఆర్ పోటోతో భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు మంత్రి గంగుల. కేసీఆర్ వెంటే పార్టీ మెత్తం ఉందని, ఎన్నికలేవైనా కేసీఆర్ పోటోనే మా గెలుపుమంత్రమన్నారు. కరీంనగర్లో తాను గెలిచినా, హుజురాబాద్లో ఈటెల గెలిచినా అది కేవలం కేసీఆర్ గారి వల్లే సాద్యమయిందన్నారు. ప్రజలకు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలే గెలుపు బాటలు వేస్తున్నాయని, కల్లాల్లో పండుతున్న పంటల్లో, కాల్వల్లో పారుతున్న నీళ్లల్లో కేసీఆర్ గారిని ప్రజలు చూస్తున్నారని, కళ్యాణలక్ష్మీ, రైతు బందు, రైతు బీమల్లో కేసీఆర్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని పార్టే ముఖ్యమన్నారు గంగుల.
హుజురాబాద్లో ఈటెల వల్ల ఎలాంటి నష్టం లేదని, క్యాడర్లో ఎవరికీ అనుమానాలు లేవని, అందరూ పూర్తిగా దీమాతో ఉన్నారు. పూర్తిగా పార్టీతో, టీఆర్ఎస్తోనే వారు ఎప్పుడూ ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ స్థానికంగా చాలా భలంగా ఉందని, ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు మంత్రి గంగుల. హుజురాబాద్లో పార్టీ క్యాడర్కి అండగా ఉంటామని, వారికి నిరంతంర అంధుబాటులో ఉంటామని, భవిష్యత్లో పార్టీ తీసుకొనే నిర్ణయానికి పూర్తిగా అందరం కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈటెల వ్యవహారంలో పార్టీ త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, పుట్ట మదు వ్వవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని, హైకోర్టులో వామన్ రావు గారి తండ్రి పిర్యాదు మేరకు చట్టం తన పని తాను చేస్తుందని, జరుగుతున్న వ్యవహారాల్లో పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని మరోసారి పునరుద్ఘాటించారు. ఎన్నికలేవైనా ఇంతలా ఆధరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి మంత్రి గంగుల ధన్యవాదాలు తెలియజేశారు.