Site icon NTV Telugu

వరంగల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కిషన్ రెడ్డి…

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమైక్యాంధ్రలో వరంగల్ నిర్లక్ష్యానికి గురైంది అని చెప్పిన ఆయన పోరాడి సాధించిన తెలంగాణలోనూ ఏడేళ్లుగా అభివృద్ధి జరగలేదు. వరంగల్ వరదలే దానికి నిదర్శనం. వరంగల్ వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేసి వదిలేశారు. రైల్వే ఓవరాలింగ్ ఫ్యాక్టరీకి ఇప్పటికీ ల్యాండ్ ఇవ్వలే. బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే వరంగల్ ను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు. టీఆర్ఎస్ డబ్బు, మద్యంతో గెలవాలని చూస్తోంది. కాంగ్రెస్ కు ఓటేస్తే మురిగినట్టే. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు.

Exit mobile version