NTV Telugu Site icon

ఫెరారీ టు రోల్స్ రాయిస్… ‘ఖల్ నాయక్’ ఖరీదైన కార్లు!

‘మున్నాభాయ్’ ఆఫ్ ముంబై… సంజయ్ దత్ కు కార్లంటే ఎంతో మురిపెం. అందుకే, ఎన్ని కాస్ట్ లీ కార్లున్నా మరో కొత్తది తెచ్చిది గ్యారేజ్ లో పెట్టుకుంటాడు. అలా పోగైన వాటిల్లో అత్యంత ఫేమస్ ‘ఫెరారీ 599 జీటీబీ’. ఇప్పుడు ఈ లిమిటెడ్ వర్షన్ ఆటోమొబైల్ ఇండియాలో అందుబాటులో లేదు. చాలా కొద్ది మంది ఇండియన్స్ మాత్రమే ‘ఫెరారీ 599 జీటీబీ’ ప్రౌడ్ ఓనర్స్! వారిలో సంజు బాబా కూడా ఒకరు!

‘ఖల్ నాయక్’ వద్ద ఉన్న మరో ఖరీదైన కారు ‘రోల్స్ రాయిస్ గోస్ట్’! పేరుకి తగ్గట్టుగా భారీగా ఉండే ఈ బిగ్ వెహికల్ మూడు కోట్లు విలువ చేస్తుంది! సంజయ్ తమ కవల పిల్లల జన్మదినం సందర్భంగా దీన్ని తన శ్రీమతి మాన్యతకి బహుమతిగా ఇచ్చాడట! ‘కేజీఎఫ్ 2’లో విలన్ ‘అధీరా’గా అలరించబోతోన్న సంజయ్ ఆధీనంలో ఉన్న మరో రెండు కార్లు ‘వైట్ ఆడి క్యూ 7 అండ్ బ్లాక్ ఆడి ఆర్ 8’. ఈ రెండూ సాధారణంగా ముంబై సిటీలో చక్కర్లు కొట్టటానికి ఉపయోగిస్తాడట ‘మున్నాభాయ్’.

ఇంత కాలం నుంచీ కొన్న వాహనాలు తన రేంజుకి సరిపోవు అనిపించిందో ఏమో… ‘ఖల్ నాయక్’ కార్ల కలెక్షన్ లో రేంజ్ రోవర్ ఒకటి జత చేశాడు! తెల్లటి హంసని తలపించే ఈ సరికొత్త అద్భుతం… 2.11 కోట్లు విలువ చేస్తుందట!