NTV Telugu Site icon

వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి డీజీసీఏ అనుమతి…

“కోవిడ్-19” వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ విధానం అమల్లో ఉండటానికి డీజీసీఏ ఓకే చెప్పింది.  పౌరుల ఇంటి వద్దకే “హెల్త్‌కేర్” సేవలు అందించడం కోసమే ఈ విధానం అమలులోకి వస్తుంది. అయితే వైద్య ఆరోగ్య సేవల పంపిణీ నేపథ్యంలో “కోవిడ్-19” వ్యాప్తి చెందకుండా నియంత్రించడం ప్రధానోద్దేశం. ప్రతిఒక్కరికీ, ఆరోగ్య సేవలు అందించడం డ్రోన్ సేవల లక్ష్యం. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ పద్ధతి ఫలిస్తే వ్యాక్సిన్ పంపిణీలో కొంత భారం తగ్గుతుంది.