Site icon NTV Telugu

కరోనాతో రాజస్థాన్ పేసర్ చేతన్ సకారియా తండ్రి మృతి…

ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆగంగేట్రం చేసిన యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ చేతన్ సకారియాను రూ. కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సంపాదనతోనే తన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నానని, ఐపీఎల్ 2021 సీజన్ తన జీవితాన్ని మార్చిందని చేతన్ సకారియా తెలిపిన విషయం తెలిసిందే.

Exit mobile version