ఏపీ–అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు జిల్లాలో పాల సేకరణను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను విధానాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అయితే ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో అమూల్ పాలసేకరణ కొనసాగుతుంది.
ఇక సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అన్ని పథకాల్లో వారికే ప్రాధాన్యం అని తెలిపారు. పాడి మహిళా రైతుల సంక్షేమం కోసమే అమూల్ ద్వారా పాల సేకరణ జరుగుతుంది. అమూల్ పాల సేకరణ ద్వారా అక్క చెల్లెమ్మలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రతి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా చెల్లించనున్నట్లు జగన్ తెలిపారు. గ్రామాల్లో పాల సేకరణ కోసం ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం జరగనుంది. 9899 గ్రామాల్లో దాదాపు రూ.4 వేల కోట్లతో పాల సేకరణ కేంద్రాల నిర్మిస్తున్నాం. పాడి రైతుల ముందే పాల నాణ్యత పరీక్ష. అంతా పారదర్శకం. రాష్ట్రానికి అమూల్ సంస్థ రాక ఒక విప్లవాత్మక కార్యక్రమం. అమూల్‌లో మహిళలే భాగస్వాములు. వారికే లాభాల పంపకం ఉంటుంది. అందుకే ఆ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది అని జగన్ పేర్కొన్నారు.