NTV Telugu Site icon

కొత్త సీఈసీగా సుశీల్‌ చంద్ర

ప్రస్తుత ఈసీఐ ఉన్న సునీల్‌ అరోరా పదవీకాలం రేపటితో ముగియనున్న తరుణంలో.. కొత్త భారత ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్రను నియమితులు కానున్నారు.. రేపే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. మే 14, 2022 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు సుశీల్‌ చంద్ర.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా ఉన్న ఆయన.. రేపే బాధ్యతలు స్వీకరించనున్నారు.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా సుశీల్ చంద్ర ఆధ్వర్యంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. వచ్చే ఏడాది మార్చిలోపు గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.. వచ్చే ఏడాది మే 14తో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘంలో బాధ్యతలకు ముందు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు సుశీల్ చంద్ర.