మనుషులను కంట్రోల్ చేయడం కంటే జంతువులను కంట్రోల్ చేయడం చాలా సులభం. సర్కస్‌లో జంతువులకు నెలల తరబడి ట్రైనింగ్ ఇస్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి వాటిని తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. సర్కస్ రింగ్‌లో అవి చెప్పినట్టుగా చేస్తుంటాయి. అయితే, రోడ్డుపై యాచిస్తూ జీవనం సాగించే ఓ వ్యక్తి నాలుగు ఎలుకలకు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలియదుగాని, అవి అతను చెప్పిన విధంగా వింటున్నాయి. ఎటు విసిరేసినా, వేలు చూపించిన తరువాత ఎటు చూపిస్తే అటు వచ్చి కూర్చుంటున్నాయి. ఆ విధంగా వాటి మైండ్‌ను తన కంట్రోల్ చేస్తున్నాడు. అతను చేస్తున్న పనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది ఔత్సాహికులు ఆ దృశ్యాలను వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడు మాములోడు కాదు… ఎలుకల్ని ఎలా శాశిస్తున్నాడో చూశారా…
