Site icon NTV Telugu

లావుగా ఉన్న‌వాళ్ల‌ను ఆ దేశంలో అద్దెకు ఇస్తారు… ఎందుకో తెలుసా…!!

చాలా మంది లావుగా ఉన్నామ‌ని ఆంధోళ‌న చెందుతుంటారు.  బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఇబ్బందులు ప‌డుతుంటారు.  ఇలాంటి వారిలో ఆత్మ‌స్థైర్యాన్ని పెంచేందుకు, ఆత్మ‌న్యూన‌తను పోగొట్టేందుకు జ‌పాన్‌కు చెందిన బ్లిస్ అనే వ్య‌క్తి దెబుకారీ అనే సంస్థ‌ను స్థాపించి లావుగా ఉన్న వ్యక్తుల‌ను అద్దెకు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు.  లావుగా ఉన్న వ్య‌క్తులు తమ‌కంటే లావుగా ఉన్న వ్య‌క్తుల‌ను ప‌క్క‌న ఉంచుకుంటే వారిలో ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.  ఈ మంత్రం బాగా ప‌నిచేయ‌డంతో జ‌పాన్‌లో ఈ సంస్థ‌కు బాగా పేరు రావ‌డ‌మే కాకుండా మంచి సంపాద‌న కూడా వ‌స్తున్న‌ట్టు సంస్థ నిర్వాహ‌కుడు బ్లిస్ చెబుతున్నాడు.  ఫంక్ష‌న్స్, మీటీంగ్స్ వేటికైనా ఈ సంస్థ నుంచి ఊబ‌కాయుల‌ను తీసుకెళ్ల‌వ‌చ్చు.  అదే విధంగా, ఫిట్‌నెస్‌, జిమ్ సెంట‌ర్లు,  న్యూట్రీష‌న్ సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌ల కోసం వీరిని వినియోగించుకోవ‌చ్చు. ఇందుకోసం గంట‌కు 200 యెన్‌లు వ‌సూలు చేస్తుంద‌ట ఆ సంస్థ.  

Exit mobile version