NTV Telugu Site icon

బుడ్డోడి డ్యాన్స్ కు సోష‌ల్ మీడియా ఫిదా…

బాల్యం ఎప్పుడూ కొత్త‌గా ఉంటుంది.  చిన్న‌త‌నంలో ఏం చేసినా దానిని ఇష్టప‌డ‌తాం.  కొంత మంది పిల్లలు టీవీ చూస్తూ, మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు.  అయితే, ఈ బుడ్డోడు పార్క్ లో అంద‌రి మ‌ద్య పెద్ద‌వాళ్ల‌తో క‌లిసి వాళ్లు చేస్తున్న విధంగా రిథ‌మిక్ గా స్టెప్పులు వేస్తూ మెప్పించాడు.  ఈ వీడియోను అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆట‌గాడు రెక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఒక్క‌సారిగా వైర‌ల్ అయింది.  బుడ్డోడి స్టెప్పుల‌ను చూసిన నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.  ఈ విడియోను ఇప్ప‌టికే 2.8 మిలియ‌న్ల మంది వీక్షించారు.