Site icon NTV Telugu

Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!

Ramoji Rao Died

Ramoji Rao Died

Ramoji Rao Passed Away: ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్ కె పరిమితమయ్యారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా చెబుతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండడంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈరోజు తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

Kangana Ranaut: “తల్లి గౌరవం కోసం 1000 ఉద్యోగాలను వదులుకుంటా”.. కంగన రనౌత్‌ని కొట్టిన కుల్వీందర్ కౌర్..

ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించక పార్థివదేహాన్ని ఫిలిం సిటీ లోని నివాసానికి తరలించారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ అదే విధంగా ప్రియా పచ్చళ్ళు వ్యాపారం నిర్వహించేవారు. అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందించారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడుమూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు. ఇది 2015వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Exit mobile version