Site icon NTV Telugu

food waste penalty: ఫుడ్ వేస్ట్ చేస్తున్నరా.. అయితే మీకు ఫైన్ వేస్తారు జాగ్రత్త !

Untitled 1

Untitled 1

food waste penalty: మీకు కావాల్సినంత తినండి.. కానీ ఆహారాన్ని మాత్రం వృథా చేయకండని అంటుంది ఈ రెస్టారంట్ యాజమాన్యం. ఏంది వీళ్లు కొత్తగా మాట్లాడుతున్నారు.. మా డబ్బులు పెట్టి కొనుక్కొని తినే ఫుడ్‌ను మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని అనుకుంటున్నారా? అయితే పొరపాటున కూడా ఈ హోటల్‌ గడప తొక్కకండి బాస్.. ఎందుకంటే ఈ హోటల్ వాళ్లు ఫుడ్ వేస్ట్ చేస్తే ఫైన్ వేస్తామని బోర్డ్ పెట్టుకొని కూర్చుకున్నారు. చాలా కొత్తగా ఉందే వీళ్ల పద్ధతి.. ఇంతకి ఏంటి వీళ్ల స్టోరీ అంటే..

READ MORE: Nellore Lady Don Arrest: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు.. నెల్లూరు లేడీ డాన్‌ అరెస్ట్..

పుణెలోని ఓ రెస్టారంట్ కథ..
వేస్ట్ చేసిన ఫుడ్‌కి ఫైన్ కట్టాలని చేతితో రాసిన ఆ రెస్టారంట్ మెనూ బోర్డ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ మెనూ బోర్డ్ లైవ్‌లో మహారాష్ట్రలోని పుణెలో ఉంది. ఓ నెటిజన్ ఆయనకు ఆకలి కావడంతోనో లేకపోతే పని ఉండో ఆ పక్కకు వెళ్లినట్లు ఉన్నారు. ఆ వైపుగా పోతుంటే ఆయనకు ఓ ఆసక్తికరమైన బోర్డు కనిపించింది. ఏంటమ్మా ఇది అని దగ్గరకు పోయి చూసినట్లు ఉన్నాడు. ఎందుకు ఇందతా అంటే ఆయనకు ఆసక్తికరంగా అనిపించింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని పుణెలో ఓ రెస్టారంట్ తమ వద్ద ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే.. రూ.20 చెల్లించాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన మెనూను ఓ నెటిజన్ ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ.. “పుణెలోని ఓ హోటల్ వృథా ఆహారానికి రూ.20 ఛార్జీ వసూలు చేస్తోంది. ప్రతి రెస్టారంట్, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో ఇలాంటి నిబంధన పెడితే కొంత వరకైనా ఆహార వృథాని అరికట్టవచ్చు” అని రాసుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ వేస్ట్‌ను తగ్గించడానికి ఇదో మంచి ప్రయత్నంగా కొందరు అంటుంటే.. నచ్చని ఫుడ్ బలవంతంగా ఎలా తింటాం బ్రో అని మరికొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రెస్టారంట్ యాజమాన్యం మాత్రం కస్టమర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే లక్ష్యంతో ఆ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తినడానికి కూర్చుకున్నప్పుడు ఆహారపదార్థాలను తినేంత మేరకు మాత్రమే వడ్డించుకోవడం అనేది చేస్తే.. చాలా వరకు ఫుడ్ వేస్ట్‌ను అరికట్టవచ్చు అనే అభిప్రాయాలు కామెంట్‌ల రూపంలో ఈ పోస్ట్‌కు వస్తున్నాయి..

READ MORE: Cool Attitude : ఏం గుండెరా వాళ్లది.. వరదలోనూ వదులుకోని చిల్‌ మూడ్‌.. (వీడియో)

Exit mobile version