Pakistan Family Celebrates India Women’s World Cup Win: టీం ఇండియా మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ పాకిస్థాన్‌లో సంబరాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఈ చారిత్రక విజయాన్ని వేడుక చేసుకుంటూ కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు కన్పించాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొంది.”కేక్ కట్ వేడుక! మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీం ఇండియాకు అభినందనలు! భారత టీంకు పాకిస్థాన్ నుంచి ప్రేమ, మద్దతు.” అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో పాకిస్థాన్‌కి చెందిన కుటుంబం ఆ దేశ జర్సీలను ధరించింది. ఆ కేక్‌పై టీమిండియా ప్లేయర్లకు సంబంధించిన ఫొటోను ఉంచారు. అంతే కాదు.. ఇదే ఐడీలో పోస్ట్ చేసిన మరో వీడియోలో భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫొటోను టీవీలో ఉంచారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి కేక్ తినిపిస్తున్నట్లు వీడియోలో ఉంది. “arshadmuhammadhanif” అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై అనేక మంది యూజర్స్ స్పందించారు. ఎక్కువ శాతం జనాలు కామెంట్లలో ధన్యావాదాలు తెలిపారు.
READ MORE: NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ..!
ఇదిలా ఉండగా.. మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్ సేన తెరదించింది. మిథాలీ రాజ్ నాయకత్వంలో రెండుసార్లు భారత్ ఫైనల్‌కు వెళ్లినా.. నిరాశ తప్పలేదు. ఈసారి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫాన్స్ అయితే టపాసులు కాలుస్తూ తెగ ఎంజాయ్ చేశారు. మొదటిసారి మెగా టోర్నీ గెలవడంతో బీసీసీఐ భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. వన్డే ప్రపంచకప్ 2025 గెలవడంతో భారత మహిళా జట్టు రూ.39 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.51 కోట్ల నజరానాను ప్రకటించింది.
