Site icon NTV Telugu

Bihar: స్కూల్‌లో “నాగమణి”ని వదిలి వెళ్ళిన తాచు పాము..? అలాంటి మణి నిజంగా ఉందా..?

Nagamani

Nagamani

Does Nagamani really exist?: కథలలో నాగమణి గురించి తరచుగా వినే ఉంటాం. కానీ ఇప్పటివరకు ఎవరూ ఈ దైవిక శక్తివంతమైన వస్తువును కనుగొనలేదు. ఇటీవల.. బీహార్‌లోని ఒక పాఠశాలలో నాగమణి దొరికిందని వాదన వచ్చింది. వాస్తవానికి.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సాహెబ్‌గంజ్ స్కూల్‌లో విషపూరితమైన తాచు పాము స్ఫటికం లాంటి వస్తువును వదిలిపెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. స్థానికులు దానిని నాగమణిగా భావిస్తున్నారు. ఇది మరోసారి నాగమణి ఉనికి గురించి ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. దీనిపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. నాగమణి నిజంగా ఉందా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనికి సమధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Prashant Neel: ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ డిమాండ్లు వింటే మైండ్ బ్లాక్..?

శాస్త్రీయ దృక్కోణంలో నాగమణి లేదా ‘పాము రత్నం’ ఉనికిలో లేదని చెబుతున్నారు. పాముల శరీరంలో అలాంటి రత్నం లేదా మణి కనిపించదని సైన్స్ స్పష్టంగా చెబుతోంది. అలాంటి రత్నాన్ని కనుగొన్నట్లు చాలాసార్లు వాదనలు వచ్చినా.. దర్యాప్తులో అవి నకిలీ లేదా సహజ పదార్థాలు అని తేలింది. కోబ్రాస్ వంటి కొన్ని పాముల తలలపై మెరిసే లేదా వృత్తాకార పొలుసులు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు రత్నాలలా కనిపిస్తాయి. దీంతో పాముల కడుపులో కనిపించే రాళ్లను (కాల్షియేటెడ్ ద్రవ్యరాశి) కూడా ‘రత్నాలు’ భావిస్తున్నారు. ఇవి రత్నాలు కావు. సహజంగా లభించే పదార్థాలు, వీటికి ఎటువంటి ఆధ్యాత్మిక శక్తితో సంబంధం లేదు. భారతీయ పురాణాలు, కథలలో నాగమణి గురించి అనేక కథలు ఉన్నాయి. దానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతారు. అందుకే పాములకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని జానపద కథలు ప్రబలంగా చెబుతున్నాయి. అయితే, ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారం లేదు. ఈ కథల ఆధారంగా కొందరు నాగమణి పేరిటప్రజలను మోసం చేస్తున్నారు.

READ MORE: Kethireddy Pedda Reddy: ఆ మాట చెబితే.. నేను జేసీ ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతా..!

Exit mobile version