NTV Telugu Site icon

Corona Effect : ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..?

Wrkk

Wrkk

కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. కొన్ని రాష్ట్రాల్లో కఠినమైన నిబంధనలను పాటించేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐటి కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో కూడా వర్క్ ఫ్రమ్ అని చెప్పింది..హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అయితే, కేవలం క్లయింట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృ‍ద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. కాగా,నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది…

విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్‌-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. కరోనా కేసులను చూస్తే.. కోవిడ్‌-19, డెల్టా వేరియంట్‌, ఒమిక్రాన్‌.. ప్రస్తుతం జేఎన్‌1 వైరస్‌గా మన ముందుకొస్తోంది. డిసెంబర్‌ 26, డిసెంబర్ 26న నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు..