కొత్త విషయాలు ఏవైనా సరే ఈజీగా ఆకట్టుకుంటాయి. నెటిజన్లను ఒక్కసారి ఆకర్షిస్తే చాలు… కంటెంట్ వైరల్ అవుతుంది. చాలామంది రకరకాల జ్యూసులు, వంటలు చేసి యూట్యూలో పెట్టి పాపులర్ అవుతుంటారు. మనుషులే కాదు, మేము కూడా జ్యూసులు తీయగలం, వంట చేయగలం అని అంటున్నాయి కొన్ని పిల్లులు. జ్యూస్ తీస్తూ, వంట చేస్తున్న పిల్లులకు సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్లు ఉంటున్నారు. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అదేంటి పిల్లులు ఎలా జ్యూసులు చేస్తాయి… అనే డౌట్ రావొచ్చు. పిల్లులు వంట చేయవు. స్క్రీన్ ముందు మాత్రమే పిల్లులు నిలబలడి ఉంటాయి. వెనకుంచి మనుషులు వంటచేస్తుంటారు. అయితే, చూసేందుకు అచ్చంగా పిల్లులు వంట చేస్తున్నట్టు ఉండటంతో ఈ తరహా వీడియోలకు డిమాండ్ పెరిగింది.
వైరల్: జ్యూసులు, వంటలు చేస్తున్న పిల్లులు… లక్షల్లో వ్యూస్…
