NTV Telugu Site icon

YS Viveka: వివేకా హత్యకు నాలుగేళ్లు.. వారికి శిక్ష పడాలన్న సునీత

Ys Suneehta

Ys Suneehta

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై నేటితో నాలుగేళ్లు అయింది. వివేకా హత్యకు సంబంధించి సూత్రధారులు ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణను సీబీఐ విచారిస్తోంది. పులివెందులలో వివేకానందరెడ్డి నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకా కుమార్తె సునీత పాల్గొన్నారు. వివేకా సమాధివద్ద నివాళులర్పించిన సునీత.. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలవాలి.. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదని అన్నారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలన్నారు. ఈ కేసులో గతంలో సిట్ కానీ, ఇప్పుడు సీబీఐ కానీ విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులు విచారణకు సహకరిచాలని కోరారు. గతంలో కడప అంటే ఫ్యాక్షన్ గుర్తుకు వచ్చేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గడిచిన 30 ఏళ్లలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కానీ నా తండ్రి హత్యతో మళ్లీ మొదలయ్యాయనిపించిందన్నారు. తన పరిస్థితి మరే మహిళకు రాకూడదంటే.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కాబట్టి తానేమీ మాట్లాడనని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. వివేకా కేసులో సహకరిస్తున్న వారికి సునీత కృతజ్ఞలు తెలిపారు.

Also Read:Komaki: మార్కెట్లోకి కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల ముందు..2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్​ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. వివేకా హత్య జరిగిన రోజే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. పలువురు అనుమానితులు, సాక్షులను సిట్ విచారించింది. అయితే, హంతకులు ఎవరనేది మాత్రం దర్యాప్తు బృందాలు తేల్చలేకపోయాయి. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత.. సీబీఐ విచారణ చేయించాలంటూ 2019 నవంబరులో హైకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్‌ను మాత్రం స్వీకరించిన హైకోర్టు.. వివేకా కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. కడపలో విచారణ ప్రారంభించారు. కడప, పులివెందులలో పలువురు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించారు. ఇప్పటివరకు 248 మంది విచారణ చేశారు. వివేకా ఇంటి వద్ద రెండుమూడు పర్యాయాలు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్‌ చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆరోపణులు ఎదుర్కోంటున్నారు. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించారు. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి సైతం విచారణ కోసం నోటీసులు ఇచ్చారు. గత ఆదివారం ఆయన విచారణకు హాజరైయ్యారు. అయితే అధికారులు లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. నోటీసులు ఇస్తే మరోసారి విచారణకు వస్తానని తెలిపారు.

Show comments