Site icon NTV Telugu

రేపటి నుంచి వైఎస్ షర్మిల.. రైతు ఆవేదన యాత్ర

వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల.. మ‌రో పోరాటానికి సంసిద్ధ‌మౌవుతున్నారు. తెలంగాణ రైతుల కోసం… రైతు ఆవేదన యాత్ర చేప‌ట్ట‌నున్నారు వైయస్ షర్మిల. ఈ రైతు ఆవేదన యాత్రను రేపుటి (ఆదివారం) నుంచి ప్రారంభించ‌నున్నారు వైఎస్ ష‌ర్మిల‌. ఈ యాత్ర‌లో భాగంగానే.. రేపు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల ప‌రామ‌ర్శించ‌నున్నారు.

అలాగే.. మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లికి వెళ్ల‌నున్నారు ష‌ర్మిల‌. కంచనపల్లిలోని ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు ష‌ర్మిల‌. ఆ తర్వాత కౌడిపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో మరొక రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల కలిసి వారిని ప‌రామ‌ర్శించ‌నున్నారు.

Exit mobile version