పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సంగ్ చన్నీని ఎంపిక చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో చరణ్‌జిత్ సింగ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు అవకాశం దక్కింది. వచ్చే ఏడాది పంజాబ్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ, శిరోమణి అకాళిదళ్, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు పంజాబ్‌పై దృష్టి పెట్టాయి. శిరోమణి అకాళిదళ్, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పటికే కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. తాము గెలిస్తే దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించాయి. వీటికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో దళితులు 32 శాతం ఉంటే, సిక్కులు 25 శాతం మంది ఉన్నారు. ఇక మొత్తం 30 మంది దళితులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అటు కేంద్రంలో ముగ్గురు మంత్రులుగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ సమీకరణాల దృష్ట్యా దళితులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చరణ్‌జిత్ సింగ్ సన్నీకి అవకాశం ఇచ్చింది.
చరణ్ జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేయడం వెనుక ఇదే కారణమా…?
