పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ కొద్ది సేపటి క్రితమే రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గామారింది. సిద్ధూ వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తారా లేదంటే, సిద్ధూకే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నది. అయితే, తెరపైకి మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఖాజర్ పేరు వచ్చింది. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సిద్ధూకోసం ఆయన తన పీసీసీ పదవిని త్యాగం చేశారు. సునీల్ ఖాజర్‌కు అవకాశలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి అవకాశం ఇస్తారన్నది కాసేపట్లో తేలిపోతుంది.
Read: కాంగ్రెస్ హైకమాండ్‌పై అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…
