NTV Telugu Site icon

ఆ ఎద్దుకోసం గ్రామ‌స్తులంతా క‌దిలి వ‌చ్చారు… ఎందుకంటే…

భార‌త దేశంలో ప్ర‌కృతికి ఎంత ప్రాముఖ్య‌త ఇస్తామో తెలిసిందే.  ఇక జంతువుల‌ను వివిధ ర‌కాల దేవ‌త‌ల పేరుతో కొలుస్తుంటారు.  ఆవును పూజిస్తే మూడు కోట్ల దేవ‌త‌ల‌ను పూజించిన‌ట్టే అని చెబుతారు.  ఇక‌, ఎద్దును నందీశ్వ‌రుడిగా పూజిస్తారు.  కొన్ని చోట్ల కొన్ని ర‌కాల ఎద్దుల‌ను నిత్యం ప్ర‌జ‌లు పూజిస్తుంటారు.  విశాఖ‌ప‌ట్నంలోని రిషికొండ ఒమ్మివాని పాలెం అనే గ్రామం ఉంది.  ఈ గ్రామంలో ఒమ్మి గ‌డ్డెన్న అనే కుటుంబానికి చెందిన దేవుడు తౌడు పెద్దు అనే ఎద్దు ఉన్న‌ది.  ఈ ఎద్దును గ్రామంలోని ప్ర‌జ‌లంతా నందికి ప్ర‌తిరూపంగా భావించి కొలుస్తుంటారు.  అయితే, సోమ‌వారం రోజున ఈ ఎద్దు ఓ ఇంటి ముందు నిల‌బ‌డి హ‌టాత్తుగా కుప్ప‌కూలిపోయింది.  ఏం జ‌రిగిందో తెలిసేలోపే ఆ ఎద్దు మ‌ర‌ణించింది అనే వార్త ఊరంతా తెలిసిపోయింది.  దీంతో ఊరు ఊరంతా క‌దిలి వ‌చ్చి క‌న్నీరు పెట్టింది.  సోమ‌వారం రాత్రి పెద్ద ఎత్తున గ్రామంలో గ‌రిఢీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  విశేష‌మైన పూజ‌లు చేశారు.  రెండు రోజుల‌పాటు పూజ‌లు నిర్వ‌హించిన త‌రువాత తౌడు పెద్దుకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  

Read: క‌రోనా క‌ట్ట‌డికి బ్రిటన్ ఎంత ఖ‌ర్చు చేసిందో తెలుసా?