పువ్వులను ఇష్టపడని మహిళలు ఉండరు. ఎన్నో రకాల పువ్వులు నిత్యం మనకు మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు చాలా మంది హోమ్ గార్డెనింగ్ పేరుతో పూల మొక్కలను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అయితే, బ్రహ్మకమలం, రఫ్లీషియా వంటి పువ్వులు అరుదుగా పూస్తుంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వులు పూస్తుంటాయి. పెనిస్ ప్లాంట్ల్ లేదా కార్ప్స్ ప్లవర్ అనే పుప్వు చాలా అంటే చాలా అరుదుగా మాత్రమూ పూస్తుంది. చరిత్రలో ఇప్పటి వరకు కేవలం మూడుసార్లు మాత్రమే పూసినట్టు చరిత్ర చెబుతున్నది. గతంలో ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఒకసారి పూయగా, ఇప్పుడు నెదర్లాండ్ లో పెనీస్ చెట్టుకు పువ్వు పూసింది. అత్యంత అరుదైన విషయం కాబట్టి ఆ పువ్వు ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఈ పువ్వు దగ్గరకి వెళ్లి నిలబడితే దాని నుంచి వచ్చే వాసన భరించలేనంతగా ఉంటుంది. కుళ్లిపోయిన శవంవాసన వస్తుంది. అందుకే దాని దగ్గర ఉండాలంటే భయపడిపోతారు. ఈ పువ్వుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read: క్రిస్మస్‌కోసం టీవీ కొంటే… టీవీతో పాటు బాక్సులో…