Site icon NTV Telugu

ఈ చెట్టును ముట్టుకుంటే చాలు… కొమ్మ‌లు ఊగిపోతాయి… ఎందుకంటే…

కొన్ని చెట్ల ఆకులు ముట్టుకుంటే ముడుచుకుపోతాయి.  కొన్ని తీగ‌లు మెలితిరిగిపోతాయి.  అయితే, ఈ చెట్టు అన్నింటికంటే ప్ర‌త్యేకం.  ఈ చెట్టు కాండాన్ని ప‌ట్టుకుంటే చాలు.. పైనున్న కొమ్మ‌లు ఊగిపోతాయి.  దూరం నుంచి ఆ చెట్టును చూసినా దానిలో ప్ర‌తిస్పంద‌న‌లు క‌లుగుతాయ‌ట‌.  ఈ చెట్టు పేరు రండియా డ్యుమెటోర‌మ్.   వేళ్ల నుంచి కొమ్మ‌ల చివ‌రి వ‌ర‌కు చాలా సున్నిత‌మైన సెన్సార్ల వంటి భాగాలు ఇందులో ఉంటాయట‌.  ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని దుద్వా జాతీయ పార్క్‌లోని క‌టార్నియా వైల్డ్ లైఫ్ శాంక్ఛురీలో ఈ రండియా డ్యుమెటోర‌మ్ చెట్లు క‌నిపిస్తాయి.  ఈ చెట్టు మొద‌లు లావుగా ఉంటుంది.  ఊదా రంగులో ఉండే ఈ చెట్లు చాలా అరుదుగా ఉంటాయ‌ని,  ఇవి అన్ని చోట్లా పెర‌గ‌వ‌ని, కేవ‌లం గ‌డ్డి మైదానాల ప్రాంతాల్లోనే పెరుగుతాయ‌ని క‌టార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అధికారులు చెబుతున్నారు.  

Read: తైవాన్‌కు చైనా ముప్పు… ఆ బాధ్య‌త ప్ర‌పంచానిదే…

Exit mobile version