తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌ను ఖాళీచేసింది అమెరికా.. తాలిబన్లు పెట్టిన డెడ్‌లైన్‌కు ముందే తన బలగాలను పూర్తిగా తరలించింది.. కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా చిట్టచివరి విమానం సీ 17 యూఎస్ వెళ్లిపోయింది.. ఆఫ్ఘన్ నుంచి వెనుదిరిగిన చివరి అమెరికా సైనికుడు మేజర్ జనరల్ రాయబారి క్రిస్ గా పెంటగాన్ ప్రకటించింది. దీంతో.. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వెనుదిరిగినట్టు అయ్యింది.. ఇక, యూఎస్ బలగాల తరలింపు పూర్తికావడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ వంటి తదితర దేశాలు… తమ సైన్యాన్ని ఇప్పటికే స్వదేశానికి తీసుకెళ్లాయి..
మరోవైపు.. ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దేవీశక్తి పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. వందలాది మంది భారతీయులతో పాటు ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులను మానవతా దృక్పథంతో తరలించింది. ఇంకా కొంత మంది భారతీయులు…చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అమెరికా, నాటో దళాల సహకారంతోనే… ఇప్పటి వరకు భారత్ తరలింపు ప్రక్రియ చేపట్టింది. అక్కడి చిక్కుకున్న వారిని ఎలా తరలించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు భారత్ ముఖ్యమైన దేశమని.. ఆ దేశానికి ఎలాంటి హాని జరగబోదని తాలిబన్లు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలతో ఉన్న సత్సంబంధాల మాదిరిగానే.. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం భారత్‌తో మంచి సంబంధాలను ఆశిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
