మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, కోవిడ్‌కు ముందు వరుసగా విదేశీ పర్యటనలో ప్రపంచాన్ని చుట్టేసిన మోడీ.. విమాన ప్రయాణంలో సమయాన్ని చాలా ప్లాన్‌గా సద్వినియోగం చేసుకునేవారు.. ఒకసారి ఆయన.. కేవలం విమాన ప్రయాణంలో మాత్రమే రెస్ట్ తీసుకుంటూ.. వరుసగా మూడు దేశాలు చుట్టివచ్చిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, అమెరికాకు విమానంలో వెళుతున్న సమయంలోనూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ప్రధాని మోడీ… సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. దీనికి సంబంధించిన ఒక ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.. ఆ ఫొటోలో మోడీ ఏవో ఫైల్స్ ను చూసుకుంటున్నారు.. ఆ ఫొటోను షేర్ చేసిన మోడీ.. సుదీర్ఘ విమాన ప్రయాణం ముఖ్యమైన కాగితాలను, ఫైళ్లను చూసేందుకు అవకాశం కల్పించింది అంటూ రాసుకొచ్చారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఢిల్లీ నుంచి ఎయిర్ ఫోర్స్-1 బోయింగ్ 777-337 ఈఆర్ విమానంలో అమెరికాకు వెళ్లారు. ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో తను బసచేసే హోటల్‌కు చేరుకున్నారు.. ప్రధాని మోడీ 3 రోజుల పర్యటనలో మొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటాడు, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ఇక, వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద తనకు స్వాగతం పలకడానికి వేచి ఉన్న వ్యక్తులను కలవడానికి తన కారు నుంచి దిగి వారిని పలకించారు మోడీ. మరోవైపు ఇవాళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో భేటీకానున్న భారత ప్రధాని.. రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలుసుకోనున్నారు.
