NTV Telugu Site icon

కేంద్ర‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు: వైసీపీ ఎన్డీయే కూట‌మిలో చేరాలి…

కేంద్ర మంత్రి అథ‌వాలే ఈరోజు విశాఖ‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి రాందాస్ అథ‌వాలే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ త‌న‌కు మంచి మిత్రుడు అని, వైసీపీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని, కేంద్రం భాగ‌స్వామ్యంతోనే రాష్ట్రం అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, రోడ్లు, నీటిపారుద‌ల ప్రాజెక్టుల ద్వారా ఏపీకి మేలు జ‌రుగుతుంద‌ని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌తో ఎస్సీఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌కు కొంత విఘాతం క‌లుగుతుంద‌ని, ఎలాంటి న‌ష్టం జ‌గ‌కుండా ఉండేందుకు పార్ల‌మెంట‌రీ క‌మిటీని సిఫార్సు చేశామ‌ని అథ‌వాలే తెలిపారు. మూడు రాజ‌ధానుల అంశం కేంద్రం ప‌రిధిలో లేద‌ని మ‌రోసారి కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. పీవోకే విష‌యంలో ఆయ‌న ఘాటుగా స్పందించారు. పాక్ ఆక్ర‌మిత కాశ్మిర్ భార‌త్ భూభాగ‌మే అని, ఎప్ప‌టికైనా తిరిగి ఇండియాలో విలీనం అవుతుంద‌ని అన్నారు. పాక్ పీవోకేను వీడితేనే రెండు దేశాల మ‌ధ్య స్నేహం కొన‌సాగుతుంద‌ని అన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలి అంటే క‌నీసం 15 ఏళ్లు ప‌డుతుంద‌ని అన్నారు.

Read: ఐసిస్ కీల‌క హెచ్చ‌రిక‌: వెతికి మ‌రీ చంపుతాం…