ఫిలిప్పిన్స్‌లో రాయ్ తుఫాన్ భీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి ఫిలిప్పిన్స్‌లోని అన్ని రాష్ట్రాలు వణికిపోయాయి. ఈ వర్షాలకు సుమారు 23 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ పై ముందుగానే హెచ్చరించి తీరప్రాంతాలవారిని తరలించడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. అయితే, తుఫాన్ కారణంగా భారీ ఆస్తీనష్టం సంభవించింది.
Read: ఆ వీడియో మళ్లీ వైరల్…
దేశంలోని సింహభాగం రాష్ట్రాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రాయ్ తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 195 నుంచి 270 కిమీ వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ పెనుగాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. భారీ వర్షాలు కురవడంతో ఇల్లు కొట్టుకుపోయాయి. కరెంట్ స్తంభాలు నేలకొరగటంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ కట్ అయింది. దీంతో రాష్ట్రాల్లో కరెంట్ లేక అంథకారమయ్యాయి.
