ప్రముఖ హీరోయిన్ త్రిషకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డు సాధించింది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గెల్డెన్ వీసాలను ఐదేళ్లు లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి.
Read Also: రజనీకాంత్ “పెద్దన్న” ట్విట్టర్ రివ్యూ
యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయాన్ని త్రిష స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు. త్రిష ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయగానే ‘క్వీన్ ఆఫ్ కోలీవుడ్’ అంటూ ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గతంలో ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర వంటివారు ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి మాత్రం త్రిషనే.
