Site icon NTV Telugu

కొత్త రూల్స్‌.. ఈ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..!

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించినవారిపై జరిమానా విధించడమే కాదు.. నిబంధనలను ఉల్లంఘిచినవారికి నోటీసులు పంపడంపై కూడా ఫోకస్‌ పెట్టింది కేంద్ర ప్రభుత్వం..దీనికి కోసం కేంద్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 15 రోజుల్లోగా నోటీసులు పంపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోటారు వాహన సవరణ చట్టాన్ని అనుసరించి… కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశంలోని 10 లక్షలు మించి జనాభా ఉన్న నగరాలకూ, నోటిఫికేషన్‌లో పేర్కొన్న 132 నగరాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

కేంద్రం జారీ చేసిన నోఫికేషన్‌ ప్రకారం.. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినవారికి ఆయా రాష్ట్రాలు 15 రోజుల్లోగా నోటీసులు పంపాలి.. సంబంధిత వ్యక్తి చలాన్‌ కట్టేంతవరకూ రికార్డులను భద్రపరచాలి.. నిబంధనలు ఉల్లంఘించినవారికి చలాన్ల జారీకి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించాలి.. స్పీడ్‌ కెమెరా, సీసీటీవీ, స్పీడ్‌ గన్‌, బాడీ కెమెరా, డ్యాష్‌ బోర్డ్‌ కెమెరా… ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌, వే-ఇన్‌ యంత్రాలు చలాన్ల జారీకి ఉపయోగించాలి.. జాతీయ, రాష్ట్ర రహదారులు, అధిక ముప్పు ఉన్న ప్రాంతాలు, కీలక జంక్షన్లు, రాకపోకలు అధికంగా ఉండే కారిడార్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలి.. హెల్మెట్‌ ధరించకపోవడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం, నో పార్కింగ్‌ ప్రాంతంలో వాహనాలను నిలపడం, రెడ్‌ లైట్‌ జంపింగ్‌, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయడం వంటి అపరాధాలకు సీసీ టీవీ ఆధారంగా నోటీసులు జారీ చేయొచ్చని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది కేంద్రం..

Exit mobile version