NTV Telugu Site icon

ఆ టీవీ స్టార్ అభిమానుల కోసం దాన్ని అమ్మి కోట్లు సంపాదిస్తుంది…

స్టార్స్ ఏం చేసినా అంద‌మే.  వారి కోసం అభిమానులు ఏమైనా చేయ‌డానికి సిద్దంగా ఉంటారు.  క‌టౌట్లు క‌ట్ట‌డం ద‌గ్గ‌రి నుంచి కొబ్బ‌రికాయ‌లు కొట్ట‌డం ద‌గ్గ‌రి నుంచి వారు వాడిన వ‌స్తువుల‌ను సేక‌రించ‌డం వ‌ర‌కూ చేస్తుంటారు.  అభిమానుల బ‌ల‌హీన‌త‌ల‌ను కొంత‌మంది స్టార్స్ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తుంటారు.  అలాంటి వారిలో పాపుల‌ర్ టీవీన‌టి మాటో కూడా ఒక‌రు.  టీవీషో న‌టిగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉన్న‌ది.  సోష‌ల్ మీడియాలో ఈ న‌టి నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.  

Read: దేశంలో మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… మొద‌టి ఎఫెక్ట్ ఆ న‌గ‌రంపైనే…

ఓ అభిమాని త‌న‌కు మాటో అపాన్‌వాయువు కావాల‌ని, ఎంతైనా పే చేస్తాన‌ని అడిగాడు.  ఆ అభిమాని కోరిక మేర‌కు ఆమె ఓ బాటిల్ త‌న అపాన్‌వాయువును ప‌ట్టి 1400 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్మింది.  లాభ‌సాటిగా అనిపించ‌డంతో వెంట‌నే మాటో దానిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.  దీంతో అభిమానులు వేలం వెర్రిగా త‌న‌కు కావాలంటే త‌న‌కు కావాల‌ని కోర‌డంతో అపాన్‌వాయువును బాటిల్స్‌లో నింపి అమ్మ‌డం మొద‌లుపెట్టింది.  ఒక్క వారంలో దాని ద్వారా 70 వేల ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్ల ఆదాయం ల‌భించిన‌ట్టు పేర్కొన్న‌ది.