NTV Telugu Site icon

తొలి భూమి ఫొటో ఇదే… ఎప్పుడు తీశారో తెలుసా?

భూమి ఎలా ఉంటుంది అంటే బ‌ల్ల‌ప‌రుపుగా ఉంటుంద‌ని పూర్వం రోజుల్లో న‌మ్మేవారు.  బ‌ల్ల‌ప‌రుపు సిద్ధాంతం చాలా కాలం అమ‌లులో ఉన్న‌ది.  లేదు గోళాకారంగా ఉంది అంటే అలాంటి వారికి చంపేసిన రోజులు ఉన్నాయి.  శాస్త్ర‌వేత్త‌ల‌కు అప్ప‌ట్లో గ‌డ్డురోజులు అని చెప్పాలి.  శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నా వాటిని మిష‌న‌రీల ప్రాభ‌ల్యం ఉండ‌టంతో వాటిని న‌మ్మేవారు కాదు.  1900 సంవ‌త్స‌రం నుంచి ప్ర‌పంచంలో టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డం మొద‌లైంది.  ఫొటోగ్ర‌ఫి అందుబాటులోకి వ‌చ్చింది.  

Read: భార‌త్‌లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీష‌ర్లు… ఎందుకో తెలుసా?

రైట్ సోద‌రులు విమానాల‌ను క‌నుగొన్న త‌రువాత విమానాలను వాణిజ్య‌ప‌రంగా వినియోగంలోకి తీసుకువ‌చ్చినా భూమి వాస్త‌వ రూపానికి సంబంధించిన ఫొటోలను తీయ‌లేదు.  అయితే, ఈ మొద‌టిసారి భూమిని స్పేస్ నుంచి ఫొటో తీసింది ఎప్పుడు అంటే 1946, అక్టోబ‌ర్ 24 న అని చెప్తాం.  జ‌ర్మ‌నీకి చెందిన నాజీ రాకెట్ వీ2 భూమినుంచి 105 కిలోమీట‌ర్ల ఎత్తు నుంచి భూమిని ఫొటో తీసింది.  దీంతో ఆ ఫొటోనే మొద‌టి భూమి ఫొటోగా చ‌రిత్ర‌కెక్కింది.  బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫొటో త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు 9 ల‌క్ష‌ల‌కు పైగా భూమికి సంబంధించిన ఫొటోలను వివిధ రాకెట్ల ద్వారా, టెలిస్కోపుల ద్వారా, అంత‌రిక్షం ద్వారా తీశారు.