NTV Telugu Site icon

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్ మన ట్యాంక్‌ బండ్‌పైనే..

హైదరాబాద్‌లోనే కాద యావత్తు దేశంలో టీ20 క్రికెట్ మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే క్రికెట్‌ ప్రియుల్లో మరింత జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌. ట్యాంక్‌ బంద్‌ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. 56.1 అడుగుల పొడవు, 9 టన్నుల బరువున్న ఈ క్రికెట్‌ బ్యాట్‌ ను అజారుద్దీన్‌ ట్యాంక్‌ బండ్‌పై మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లు అవిష్కరించారు.

ఈ సందర్భంగా అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు జరుగబోయే మ్యాచ్‌లో భారత జట్టు బ్యాలెన్సింగ్‌ ఉందని, ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం అంటూ వ్యాఖ్యానించారు.