Site icon NTV Telugu

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్ట్ జరిమానా

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ పై అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్ట్. జరిమానా కూడా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టు విచారణ జరిగింది. జీవో 123 చట్టబద్ధతపై 2016లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. కౌంటర్లు దాఖలు చేయాలని లేదా హాజరు కావాలని గత నెలలో సీఎస్ ను ఆదేశించింది హైకోర్టు.

అయితే కౌంటర్లు దాఖలు చేయనందుకు సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్ కూడా వేయలేదని సీఎస్ పై హైకోర్టు అసంతృప్తి తెలిపింది. రూ.10వేలు చెల్లించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు సీజే ధర్మాసనం ఆదేశాలిచ్చింది. పీఎం కోవిడ్ సహాయ నిధికి రూ.10వేలు చెల్లించాలని సీఎస్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 24న విచారణకు హాజరు కావాలని సోమేష్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

Exit mobile version