ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నారు. ఈరోజు నుంచి వారి పాలన మొదలైంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేశారు. అందరిని గౌవరవిస్తామని, మహిళలకు వారి హక్కులకు భంగం కలుగకుండా చూస్తామని చెబుతూనే, వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో కంటే ఈసారి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అమలులో ఉన్న సమయంలో అనేక మంది మహిళలు అశ్లీల చిత్రాల్లో నటిస్తూ జీవనం సాగించారు. సెక్స్ వర్కర్లుగా జీవితాన్ని కొనసాగించిన మహిళలు కాబూల్‌లో వేలాది మంది ఉన్నారు. అయితే, వీరిపై తాలిబన్లు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. వీడియోల్లో, అశ్లీల చిత్రాల్లో నటించిన వారికి సంబందించిన లిస్ట్‌ను తాలిబన్లు సిద్ధం చేస్తున్నారు. ఆ మహిళలను వెతికి పట్టుకొని హతమార్చేందుకు సిద్ధం అవుతున్నారని వార్తలు గుప్పుమనడంతో ఆఫ్ఘన్‌లోని మహిళలు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాలిబన్ల లిస్ట్‌లో ఆ మహిళలు…
