NTV Telugu Site icon

విశాఖ న‌గ‌రంలో ఘ‌నంగా జ‌రిగిన మ‌హాదీపోత్స‌వం…

విశాఖ న‌గ‌రంలో మ‌హాదీపోత్స‌వం కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.  ఎన్నో చోట్ల ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని చూసినా కుద‌ర‌లేద‌ని, ప‌ర‌మేశ్వ‌రుడు విశాఖ‌లోనే ఈ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించార‌ని స్వామి స్వ‌రూప‌నందేంద్ర స‌ర‌స్వ‌తి పేర్కొన్నారు.  వేదం  ఇంకా బ‌తికి ఉందంటే అది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి మ‌హిమే అని, వేదాన్ని పోషిస్తోంది ఒక తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న మాత్ర‌మే అని అన్నారు.  

Read: వీడు మాములోడు కాదు…విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కొని…

జీవితంలో ఒక్క‌సారైనా శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని చూస్తే జ‌న్మ ధ‌న్య‌మ‌వుతుంద‌ని అన్నారు.  వేదం నిల‌బ‌డితేనే ధ‌ర్మం నిల‌బ‌డుతుంద‌ని, వెంక‌న్న కృప వ‌ల‌న రాష్ట్రానికి, దేశానికి అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.  శ్రీ వేంక‌టేశ్వ‌రుడి మ‌హిమ విశాఖ‌పై ఉంద‌ని, ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్య‌క్ర‌మం గొప్ప‌గా జ‌రిగింద‌ని స్వామి స్వ‌రూప‌నందేంద్ర స‌ర‌స్వ‌తి తెలిపారు.