NTV Telugu Site icon

స్పైడ‌ర్‌మ్యాన్ లిజార్డ్‌… సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

స్పైడ‌ర్ మ్యాన్ సీరిస్‌లో వ‌చ్చిన ఎన్నో సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.  ఇటీవ‌లే స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ పేరుతో వ‌చ్చిన మూవీ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.  స్పైడ‌ర్‌మ్యాన్ గెట‌ప్ ఎలా ఉంటుందో, ఎలాంటి రంగుల్లో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.  కింద ప్యాంట్ బ్లూరంగులోనూ, పైభాగం రెడ్ క‌ల‌ర్‌లోనూ ఉంటుంది.  అలాంటి రంగుల్లో స్పైడ‌ర్ మ్యాన్ మాత్ర‌మే కాదు, స్పైడ‌ర్ మ్యాన్ లిజ‌ర్డ్ కూడా ఉంద‌ట‌.  న‌డుము నుంచి కింద‌భాగం నీలం రంగులోనూ, పైభాగం ఎరుపురంగులోనూ ఉన్న‌ది.  ఇలాంటి బ‌ల్లులు టాంజానియా, రువాండా, కెన్యా దేశాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.  ఈ బ‌ల్లిని చూసిన వెంట‌నే ఎవ‌రైనా స‌రే నిజంగా స్పైడ‌ర్‌మ్యాన్ లాగే ఉందే అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  ఈ బ‌ల్లి ఫొటోను సోష‌ల్ ఫారెస్ట్ అధికారి సుసాంత నంద పోస్ట్ చేశారు.  ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  

Read: లైవ్: ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్