2022 ప్రధమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా విజయం సాధించి రెండోసారి వరసగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నది. రైతు చట్టాలు, రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్, రైతుల మరణాల తదితర విషయాలు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ కొంత వరకు తలక్రిందులయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో గట్టిపోటీ ఇచ్చే పార్టీ సమాజ్‌వాద్ పార్టీ. ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ 2012 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2017ఎన్నికల్లో ఎస్పీ కేవలం 47 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
Read: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: ఆ సర్టిఫికెట్ లేకుంటే ఆర్నెల్లు జైలు శిక్ష…
వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ తో పాటుగా ఎస్పీకి కీలకమని చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ ప్రచారంతో పాటుగా, ఎన్నికల్లో కలిసి పోటీ చేసే పార్టీలతో సీట్లు సర్ధుబాటు చేసుకుంటోంది. ఒకవేళ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తే ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అఖిలేష్ యాదవ్‌కు వస్తుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా, పార్టీని వెనకుండి విజయం వైపు నడిపిస్తానని చెబుతున్నాడు అఖిలేష్ యాదవ్. దీంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటూనే, ఇప్పుడు పోటీ చేయనని అఖిలేష్ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు.
