Site icon NTV Telugu

ముప్పు గురించి హెచ్చ‌రిస్తే… ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారా?

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు.  ఎప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మొద‌ట సౌతాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డింది.  ఆ ఈ వేరియంట్‌ను గుర్తించిన వెంట‌నే సౌతాఫ్రికా అన్ని దేశాల‌ను అల‌ర్ట్ చేసింది.  ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ సైతం సౌతాఫ్రికా వెంట‌నే అల‌ర్ట్ చేయ‌డాన్ని ప్ర‌శంసించింది.  అయితే, మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే 30 దేశాల‌కు క‌రోనా వ్యాపించ‌డంతో దీని ప్ర‌భావం ఎంత‌గా ఉన్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  

Read: రికార్డ్‌: 24 నిమిషాల్లో 6 బ‌ర్గ‌ర్లు…

డెల్టా కంటే ఆరు రెట్లు ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో అన్ని దేశాలు అల‌ర్ట్ అయ్యాయి.  సౌతాఫ్రికా, దాని చుట్టుప‌క్క‌ల దేశాల నుంచి వ‌చ్చే రాక‌పోక‌ల‌పై నిషేదం విధించాయి.  ప్ర‌పంచ దేశాల నిర్ణ‌యంపై సౌతాఫ్రికా మండిప‌డుతున్న‌ది.  అంద‌రిమేలుకోరి ముందుగానే హెచ్చ‌రిస్తే, ఇలా త‌మ‌పై నిషేధం విధించ‌డం స‌రికాద‌ని సౌతాఫ్రికా అధ్య‌క్షుడు పేర్కొన్నారు.  

Exit mobile version