Site icon NTV Telugu

కార్తిక‌మాసం విశిష్ట‌త ఇదే…

ఈరోజు నుంచి కార్తికమాసం ప్రారంభం అవుతున్న‌ది.  సంవ‌త్స‌రంలో ఉత్త‌రాయ‌ణం, ద‌క్షిణాయ‌ణం అనే రెండు ఆయ‌నాలు ఉంటాయి.  ద‌క్షిణాయ‌ణంలో అత్యంత ప‌విత్ర‌మైన మాసం కార్తిక‌మాసం.  కార్తిక‌మాసంలో శివుడిని అత్యంత భక్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజిస్తారు.  కార్తిక‌మాసంలో దీపానికి ప్రాధాన్య‌త అధికం.  ప్ర‌తిఇంట ఉద‌యాన్నే లేచి త‌ల‌స్నానం చేసి భ‌క్తితో మ‌హాశివునికి దీపం వెలిగిస్తారు.  కార్తిక మాసంలో వ‌చ్చే కార్తిక పౌర్ణ‌మిరోజున దేశంలోని శివాల‌యాలు భ‌క్తుల‌తో నిండిపోతాయి. అరుణాచలంలో అగ్నిలింగేశ్వ‌రుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తుంటారు.

Read: న‌వంబ‌ర్ 5, శుక్రవారం దిన‌ఫ‌లాలు…

అరుణాచ‌లంలోని అరుణ‌గిరి ప‌ర్వ‌తం చుట్టూ వేలాదిమంది ఆరోజున ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటారు.  ఈ మాసంలో ఉసిరిచెట్టుకింద భోజ‌నం, వ‌న‌భోజ‌నాలు చాలా ప‌విత్ర‌మైన‌వి.  కార్తీక‌ సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం తెలియ‌జేస్తుంది.  

Exit mobile version