NTV Telugu Site icon

భార్యతో విడాకులు తీసుకున్న గబ్బర్…

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని గబ్బర్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే ఆయేషా ముఖర్జీకి ఇది రెండోసారి విడాకులు కావడం. ధావన్ కంటే ముందు ఒక్కరిని పెళ్లి చేసుకున్న ఆయేషా తనతో విడాకులు తీసుకోగా… 2012 సంవత్సరంలో ధావన్-ఆయేషా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క అబ్బాయి ఉన్నాడు. అతని పేరు జోరవర్ ధావన్. గత ఏడాది విధించిన లాక్ డౌన్ సమయంలో కొడుకుతో కలిసి చేసిన ఎన్నో వీడియోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు శిఖర్. అయితే ఈ విడాకులకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని ధావన్ ప్రకటించలేదు. ఇక ఈ ఏడాది ఇండియా యొక్క రెండో టీంకు కెప్టెన్ గా భాధ్యతలు నిర్వర్తించిన గబ్బర్ శ్రీలంక పై వన్డే సిరీస్ లో విజయం సాధించగా… టీ20 సిరీస్ ను కోల్పోయాడు.