దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. చమురు ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ బైకుల వైపు చూస్తున్నారు. గత ఆరునెలల కాలంలో దేశంలోకి కొత్త ఎలక్ట్రిక్ బైకులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధరులు అధికంగా ఉంటున్నప్పటికీ పెట్రోల్ బాదుడు నుంచి బయటపడితే చాలనుకొని ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విపణిలోకి విడుదల చేస్తున్నాయి.
Read: స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్… అతి తక్కువ ఖర్చుతో…
తాజాగా ఒడిశాకు చెందిన షెమా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ సోలార్ ప్రైవేట్ లిమిటెక్ కంపెనీ రెండు ఎలక్ట్రిక్ బైకులను విపణిలోకి తీసుకొచ్చింది. ఇందులో ఎస్ఈఎస్ టఫ్ అనే వెహికిల్ ఎక్కువ మైలేజ్ విభాగానికి చెందినది. ఇందులో 60 వోల్డ్, 30 ఏహెచ్ రెండు బ్యాటరీలను వినియోగిస్తారు. ఈ రెండు డిటాచబుల్ బ్యాటరీలే. ఈ బ్యాటరీలను చార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల వేగంతో 150 కిమీ వరకు ప్రయాణం చేస్తుంది. అంతేకాదు, ఇది 150 కిలోల లోడ్‌ను మోసుకొని వెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విభాగంలో రెండో బైక్ ఎస్ఈఎస్ హాబీ. ఇది తక్కువ మైలేజీ విభాగానికి చెందిన బైక్.ఇందులోనే 60 వోల్ట్, 30 ఏహెచ్ బ్యాటరీలను వినియోగిస్తారు. ఒకసారి చార్జ్ చేస్తే 25 కిమీ వేగంతో 100 కిమీ వరకు ప్రయాణం చేయగలదు.
