Site icon NTV Telugu

కర్నూలు సీఎం టూర్‌లో భద్రతాలోపం…అసలేం జరిగింది?

సీఎం జగన్ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం కనిపించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని కుమారుడు వివాహనికి హాజరైన సీఎం జగన్ వారిని ఆశీర్వదించారు. పంచలింగాల మాంటిస్సోరి ఒలింపస్‌ స్కూల్‌ ప్రాంగణంలో జరిగిన వేడుకలో వరుడు శివ నరసింహారెడ్డి, వధువు రూపశ్రీ లను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి జగన్.

ప్రోటోకాల్ లిస్ట్ లో కళ్యాణవేదికపై కాటసాని కుటుంబ సభ్యులు, జగన్ కి మాత్రమే పోలీస్ అనుమతి వుంది. సీఎం పర్యటన అంటే భద్రతా ఏర్పాట్లు భారీగా వుంటాయి. అయితే వేదిక వెనక నుంచి ఉన్నట్టుండి ప్రత్యక్షమై సీఎం జగన్ కాళ్ళమీద పడింది ఓ దివ్యాంగురాలు. బాధిత యువతి స్టేజి వెనక నుంచి ఒక్క సారిగా సీఎం ముందుకు రావడంతో నివ్వెరపోయారు అధికారులు.

యువతి స్థానంలో ఇంకొకరు ఉండి.. జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే ఏంటన్న దానిపై వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది. ఎవరిది లోపం అన్నదానిపై విచారిస్తున్నారు కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.

Exit mobile version