కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ భయాందోళనలు కలిగేలా చేస్తే, డెల్టా నుంచి బయటపడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. డెల్టా కంటే ఒమిక్రాన్ 6 రెట్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్‌ను మొదట సౌతాఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత ఆ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పుడు సౌతాఫ్రికాలో బయటపడుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ భాగం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జోహెన్స్‌బర్గ్‌లో నమోదవుతున్న కోత్త కేసుల్లో 90శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉంటున్నాయి.
Read: ఆలయాల ఆదాయంపై నాలుగు శాతం పన్నులు… ఆందోళనలో భక్తులు…
జోహెన్స్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రాంతం మరో వూహాన్ అయ్యేలా కనిపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాలో వ్యాక్సినేషన్ శాతం చాలా తక్కువగా ఉంది. ఇది కూడా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందటానికి ఒక కారణం కావొచ్చు. 18నుంచి 34 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకాపై అనుమానాలు, అపోహల కారణంగా వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య అత్యల్పంగా ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండటంతో వ్యాక్సినేషన్‌ను పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
