Site icon NTV Telugu

ప్రేయసి పెళ్లి.. దండలు మార్చుకుంటుంటే మధ్యలో దూరిన మాజీ లవర్..!

పాత సినిమాల నుంచి నేటి సినిమాల వరకు ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి జరగడం.. ప్రియుడు మధ్యలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆపండి అంటూ అరుపులు.. లేదా పెళ్లిపీఠలపై నుంచే తీసుకెళ్లడం.. తాలికట్టే సమయానికి వచ్చి ఆ తంతు పూర్తిచేయడం.. ఇలా ప్రేమ, పెళ్లి చుట్టూ.. తిరిగే ఎన్నో సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం.. ఇలాంటి ఘటనలు రీల్‌పైనే కాదు.. రియల్‌గా చూసిన సందర్భాలు కూడా ఉంటాయి.. తాజాగా తాన మాజీ ప్రేయసితో మరో వ్యక్తికి వివాహం జరుగుతుంటూ.. మధ్యలో దూరిన ఓ యువకుడు.. ఆమె నుదుటిపై సింధూరం దిద్ది.. ఆమెను సొంతం చేసుకోవాలని భావించాడు.. కానీ, వధువు ఎలా స్పందించింది..? బంధువులు ఏం చేశారు..? చివరకు పెళ్లి ఎవరితో జరిగింది..? అనే విషయాలు తెలుసుకోవడానికి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో ఓ వివాహ వేడుక జరుగుతోంది.. వధూవరులు దండులు మార్చుకుంటున్నారు.. ఇంతలో పెళ్లి మండపంలోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు ఓ యువకుడు.. దండలు మార్చుకుంటుండగా వెంటనే వారి మధ్యలోకి దూరి వధువు నుదుటిపై కుంకుమ దిద్దడానికి ప్రయత్నించాడు. వధువు వారిచే ప్రయత్నం చేస్తుండగా.. బలవంతంగా ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే తేరుకొని.. సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తున్నాయి.. తీరా ముఖానికి గుడ్డ కట్టుకొని వచ్చిన ఆ యువకుడు ఎవరా అని ఆరా తీస్తే.. పెళ్లి కూతురు మాజీ ప్రేమికుడని తెలిసింది. గతంలో ఆ యువకుడు తనను ప్రేమించాలంటూ ఆ యువతి వెంట పడ్డాడట.. కానీ, ఆమె తిరస్కరించిందట.. ఇక, సదరు యువకుడు మరో ప్రాంతానికి వెళ్లిపోవడం.. ఇంతలో ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించడం.. పెళ్లి కూడా జరుగుతుండడంతో.. ఆ సమాచారం తెలుసుకున్న యువకుడు.. తన ప్రేయసిని పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు తేలింది.. దీంతో.. తాత్కాలికంగా ఆ పెళ్లి నిలిచిపోయింది.. ఆ పంచాయతీ అంతటితో ఆగలేదు.. మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లి జరిపించారు.. మొత్తంగా ప్రేయసి కోసం ప్రియుడు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదు.

Exit mobile version