ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రఘురామకు బెయిల్ మంజూరు చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే ఆర్మీ ఆసుపత్రిలో అయినా వైద్య పరీక్షలు నిర్వహించేలా అనుమతులు ఇవ్వాలని రఘురామ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు రఘురామను ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించలేదని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలియజేశారు. ఇక ఏపీ సిఐడి తరపున దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని, శుక్రవారానికి వాయిదా వేస్తె సమాధానం చెప్తామని ఏపీ సిఐడి వాదించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు కేసు విచారణను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. మరి 12 గంటల తర్వాత కోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
రఘురామకృష్ణంరాజు కేసుపై సుప్రీంలో వాదనలు…బెయిల్ వస్తుందా?
